వాడివేడిగా సర్వసభ్య సమావేశం

VZM: కొత్తవలస మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం జరిగింది. కొంతమంది ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. అలాగే నిమ్మలపాలెంలో గత ప్రభుత్వ నిధులతో వేసిన రోడ్డును కూటమి ప్రభుత్వం తవ్వేసిందిని నిమ్మలపాలెం సర్పంచ్ ధ్వజమెత్తారు. ఇందులో ఎమ్మెల్సీ రఘురాజు, జెడ్పీటీసీ శ్రీదేవి, ఎంపీపీ గోపమ్మ, ఎంపీడీవో పాల్గొన్నారు.