తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి స్వామి దర్శనం కోసం 8 గంటల సమయం పడుతుండగా.. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 77,879 మంది భక్తులు దర్శించుకోగా.. 25,520 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.19 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ అధికారులు తెలిపారు.