ఏయూ శతాబ్ది ఉత్సవాలపై కీలక సమావేశం
VSP: ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై సోమవారం కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, ఎంపీ భరత్ పాల్గొన్నారు. శతాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు విస్తృతంగా చర్చించారు. కలెక్టర్, వర్సిటీ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు.