‘ఆర్టీవో కార్యాలయ ముట్టడి విజయవంతం చేయాలి’

NRPT: ఆటో కార్మికులపై ఆర్టీవో అధికారుల వేదింపులకు నిరసనగా జులై 3న నిర్వహించే ఆర్టీవో కార్యాలయ ముట్టడిని విజయవంతం చేయాలని TUCI జిల్లా కార్యదర్శి నరసింహ అన్నారు. శుక్రవారం నారాయణపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయ ఆవరణలో ఆటో కార్మికుల సమావేశంలో మాట్లాడారు. చిన్న చిన్న కారణాలు చూపుతూ అధికారులు జరిమానాలు విధించడం సరైంది కాదని అన్నారు.