'వేసవిలో పచ్చిరొట్ట ఎరువులే మేలు'
MHBD: వేసవి కాలంలో భూసారాన్ని పెంచుకోవడానికి రైతులు పచ్చిరొట్ట ఎరువులను వినియోగించుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి జినుగు మరియన్న సూచించారు. మరిపెడ మండలంలోని మామిడి, ఆయిల్ పామ్, కూరగాయల తోటలను ఆయన ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా వేసవిలో ఉద్యాన పంటల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.