VIDEO: ఎన్నికల ఎఫెక్ట్.. భారీగా ట్రాఫిక్ జామ్

VIDEO: ఎన్నికల ఎఫెక్ట్.. భారీగా ట్రాఫిక్ జామ్

RR: సర్పంచ్ మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో గురువారం ఓట్లు వేయడానికి సిటీ నుంచి జనాలు తరలి వెళ్లారు. ఈ క్రమంలో హయత్ నగర్ నుంచి వనస్థలిపురం, భాగ్యలత వరకు ప్రయాణికుల రద్దీ పెరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణికులు ఇతర మార్గాలను ఎంచుకొని ప్రయాణించాలని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.