వేములపాడులో వడగండ్ల వర్షం
ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మండలంలోని వేములపాడు గ్రామంలో వడగళ్ల వర్షం కురిసింది. కోటతిప్పల, కొండారెడ్డిపల్లి తదితర గ్రామాలలో భారీ వర్షం కురిసింది. హనుమంతునిపాడు మండల వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వర్షానికి తోడు వడగళ్ల వర్షం కూడా పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.