రేపు జిల్లాకి రానున్న ఇంఛార్జ్ మంత్రి
AKP: జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర గురువారం అనకాపల్లి వస్తున్నారు. ఉదయం విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన 11.30 గంటలకు అనకాపల్లి కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లా బడ్జెట్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే డీ.ఆర్.సీ. సమీక్ష సమావేశానికి హాజరవుతారు.