ఆధార్ లాగే భూములకు భూధార్: ఎమ్మెల్యే గండ్ర

BHPL: రేగొండ మండలం భాగిర్దిపేట గ్రామంలో బుధవారం భూ భారతి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై, మాట్లాడుతూ.. ఆధార్ లాగే భూములకు భూదార్ జారీ చేస్తామని తెలిపారు. అనంతరం సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, జూన్ 2న పట్టా పుస్తకాలు అందజేస్తామని చెప్పారు.