నాగలాపురంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

నాగలాపురంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

నాగలాపురం గ్రామానికి చెందిన డి. వేలు(40) బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వివరాల్లోకెళ్తే పిచ్చాటూరులోని ఓ హోటల్లో సప్లయర్‌గా పనిచేస్తున్న ఆయన పని ముగించుకుని బైకుపై ఇంటికి బయల్దేరాడు. నాగలాపురం బైపాస్ సమీపంలోనే చెల్లాతమ్మ ఆలయం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని సంఘటనా స్థలంలో మృతిచెందాడు. ఘటనపై ఎస్సై సునీల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.