VIDEO: ముమ్మరంగా పారిశుధ్య పనులు
AKP: సీఎం చంద్రబాబు ఈనెల 23న నక్కపల్లిలో పర్యటిస్తున్న నేపథ్యంలో పారిశుధ్యం-పరిశుభ్రత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నక్కపల్లి మండలం ఉపమాక దేవాలయం నుంచి జట్టీల వరకు జరిగే పనులను కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్, డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు పర్యవేక్షిస్తున్నారు. అలాగే కోటవురట్ల మండలం నుంచి 20 మంది పారిశుధ్య కార్మికులను తరలించి వారితో పనులు చేయిస్తున్నారు.