ఆక్సిజన్ అందక కాదు.. ఆరోగ్యం సహకరించక మృతి

ఆక్సిజన్ అందక కాదు.. ఆరోగ్యం సహకరించక మృతి

VSP: KGHలో దేవీ అనే మహిళ ఆక్సిజన్ అందక మృతి చెందినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఆస్పత్రి సూపరింటెండెంట్ వాణి శుక్రవారం తెలిపారు. నవంబర్ 6న ఆనారోగ్యంతో ఆమె KGHలో జాయిన్ అయ్యారన్నారు. పరీక్షల్లో ఆమె ఆల్కహాల్‌కు బానిసైనట్లు, లివర్ సమస్య గుర్తించామన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉండడంతో జనరల్ వార్డుకు మార్చామని, గురువారం ఆరోగ్యం సహకరించక మృతి చెందినట్లు తెలిపారు.