గోటి తలంబ్రాలు అందజేసిన గజ్వేల్ సీఐ

SDPT: శ్రీరామకోటి భక్త సమాజం చేపట్టిన కోటి తలంబ్రాల దీక్షలో గజ్వేల్ పోలీస్ శాఖ వారు కూడా పాల్గొని భక్తితో భద్రాచల సీతారాముల కళ్యాణానికి మా వంతుగా గోటి తలంబ్రాలు ఒలిచి అందించామని శనివారం గజ్వేల్ సీఐ సైదా అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రామకోటి రామరాజు మన ప్రాంతం నుండి భద్రాచల తలంబ్రాలు తీసుకెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు.