దంపతుల మృతిపై స్పందించిన సీఐ

దంపతుల మృతిపై స్పందించిన సీఐ

VZM: కొత్తవలసలో భార్యాభర్తల అనుమానాస్పద మృతి సంఘటన స్థలాన్ని సీఐ షణ్ముఖరావు శనివారం పరిశీలించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. చిరంజీవి, వెంకటలక్ష్మికి మార్చిలో వివాహం జరిగినట్లు తెలిపారు. వారికి మధ్య గొడవలు ఉన్నట్లు చెప్పారు. పోస్టుమార్టం రిపోర్టు వెలువడిన తర్వాత స్పష్టత వస్తుందని అయన పేర్కొన్నారు.