రష్యాతో రేపు చర్చలు జరుపుతాం: ఇరాన్
రేపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరుపుతామని ఇరాన్ విదేశాంగమంత్రి అరగ్చీ వెల్లడించారు. మాస్కోలో ఈ చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే తుర్కియే అధ్యక్షుడితో మాట్లాడామని తెలిపారు. రష్యా, తుర్కియే మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. ఇజ్రాయెల్, అమెరికా చర్యలు అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధం అని అన్నారు. తమ దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడుకుంటామని చెప్పారు.