ఈ నెల 10, 11న మామిడికుంట అంజనేయస్వామి జాతర

ఈ నెల 10, 11న మామిడికుంట అంజనేయస్వామి జాతర

VKB: దుద్యాల మండలం చిల్ముల్‌మైలారం, బొంరాస్పేట మండలం లింగంపల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో వెలసిన మామిడికుంట ఆంజనేయస్వామి జాతర ఈ నెల 10, 11న నిర్వహిస్తున్నట్లు పూజారి రాఘవేందర్ చారి తెలిపారు. బుధవారం స్వామివారి రథోత్సవం, గురువారం పెద్ద జాతరలో భాగంగా మధ్యాహ్నం స్వామివారి పల్లకి సేవ సాయంత్రం పెరుగు బసంతం కార్యక్రమం ఉంటుందని ఆయన చెప్పారు.