రెండోసారి సర్పంచ్‌గా ఏకగ్రీవం
KMM: నేలకొండపల్లి మండలం ఆజయ్ తండా పంచాయతీకి చెందిన తేజావత్ శివాజీ రెండో పర్యాయం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. బైరవునిపల్లి పంచాయతీ శివారు గ్రామంగా ఉన్న అజయ్ తండాకు చెందిన శివాజీ 2001లో ఎస్టీ రిజర్వేషన్ కావటంతో CPI నుంచి సర్పంచ్‌గా విజయం సాధించారు. బైరవునిపల్లి నుంచి ఆజయ్ తండాను ప్రత్యేక పంచాయతీగా చేసిన తరువాత తిరిగి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.