BIG ALERT: మధ్యాహ్నం బయటకు రావొద్దు
TG: రాష్ట్రంలో ఎండలు తీవ్రమవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలకు వాతావరణశాఖ 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది. అలాగే, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు మధ్యాహ్నం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.