'రైతు భరోసా దరఖాస్తుకు మూడు రోజులే గడువు'

'రైతు భరోసా దరఖాస్తుకు మూడు రోజులే గడువు'

MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ పరిధిలో ఉన్న కొత్త రైతులు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలని స్థానిక ఏఈవో అక్రమ్ సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసాకు ప్రభుత్వం మార్చి 25 తుది గడువుగా నిర్ణయించిందన్నారు. ఫిబ్రవరి 28 లోపు కొత్తగా భూపట్టాలు పొందిన రైతులు, ఆర్‌వోఎఫ్ఆర్ పట్టాలు ఉన్న గిరిజన రైతులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.