నారాయణి అలంకారంలో శ్రీ విరుపాక్షి మారమ్మ

నారాయణి అలంకారంలో శ్రీ విరుపాక్షి మారమ్మ

CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శ్రావణ శనివారం సందర్భంగా నారాయణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఉదయపూర్వమే అర్చకులు అమ్మవారి శిల విగ్రహాన్ని అభిషేకించారు. తరువాత నిమ్మకాయలు, కుంకుమ, పసుపు, వివిధ పుష్పాలతో నారాయణిగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.