రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
NDL: బనగానపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఇవాళ గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని స్వగ్రామం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామానికి చెందిన నారాయణ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.