VIDEO: హైవే రోడ్డుపై కూలిన హోర్డింగు.. పలువురికి గాయాలు

VIDEO: హైవే రోడ్డుపై కూలిన హోర్డింగు.. పలువురికి గాయాలు

MDK: తూప్రాన్ మండలం ఇమాంపూర్ వద్ద హైవే రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిక్ హోర్డింగ్ కూలిపోయింది. తూప్రాన్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనము అదుపుతప్పి హోర్డింగును ఢీ కొట్టింది. అక్కడే ఆగి ఉన్న కారుపై పడడంతో కారులో ప్రయాణిస్తున్న ప్రియాంక, డీసీఎం డ్రైవర్ హలీం గాయపడ్డారు. రోడ్డుపై కూలిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.