ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించిన కార్పొరేటర్

HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్‌లోని శ్రీరాంనగర్ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కార్పొరేటర్ CN రెడ్డి సందర్శించారు. హాస్పిటల్‌లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. హాస్పిటల్ సిబ్బంది వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.