INSPIRATION: జగ్జీవన్ రామ్
భారత మాజీ ఉపప్రధాని, 'బాబుజీ'గా సుపరిచితులైన జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల ఆశాజ్యోతి. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా దేశానికి ఎనలేని సేవలు అందించారు. రక్షణ శాఖ మంత్రిగా 1971 యుద్ధంలో భారత్ విజయం సాధించడంలో, వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవంలో ఆయన పాత్ర మరవలేనిది. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం నేటికీ ఎందరికో గొప్ప స్పూర్తి.