నార్నూరులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ADB: నార్నూర్ మండల కేంద్రంలో గురువారం పత్తి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో పండించిన పంటలను ప్రభుత్వ మార్కెట్ యార్డులకే విక్రయించాలన్నారు. ప్రైవేటు దుకాణాల్లో విక్రయించి మోసపోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సోయం మారుతీ, ఆడే గణేష్, జాదవ్ కైలాష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.