ఎమ్మెల్యేను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
WGL: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఫోన్ ద్వారా ఎమ్మెల్యే మాధవరెడ్డిని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు. ధైర్యంగా ఉండాలని సూచించారు.