జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన కలెక్టర్

JN: భారీ వర్షాల నేపథ్యంలో జనగామ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ కావడంతో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్&బీ, మత్స్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజల రక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ప్రమాద పరిస్థితులు ఉన్న వెంటనే స్పందించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు.