'డివైడర్ తగ్గించి రౌండ్ అబౌట్ ఏర్పాటు చేయాలి'
NLG: హుజూర్‌నగర్‌లోని ఇందిరా గాంధీ చౌక్ వద్ద అడ్డరోడ్ సెంటర్‌లో డివైడర్ అత్యధిక పొడవుగా ఉండటం వల్ల వాహనదారులు మలుపులు తీసుకునేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు. స్పష్టత లేక తరచూ చిన్నా, పెద్దా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గేందుకు డివైడర్‌ను కుదించి, రౌండ్అబౌట్‌ను ఏర్పాటు చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.