వెంకటాపూర్‌లో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం

SRD: నిజాంపేట్ మండలంలోని వెంకటాపూర్ (కె) గ్రామంలో సోమవారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు యాసంగి వరి పంటల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ప్రారంభించినట్టు పేర్కొన్నారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.