ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
VZM: రైతుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పిస్తుందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఇవాళ వేపాడ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రధాన లక్ష్యం అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారిణి స్వాతి పాల్గొన్నారు.