VIDEO: భారీ వర్షానికి జలదిగ్భంధమైన రోడ్లు

MBNR: జడ్చర్ల పట్టణంలో ఈరోజు సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నేతాజీ చౌరస్తా నుంచి సిగ్నల్ గడ్డ వరకు వెళ్లే రోడ్డు నీటితో నిండిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చైతన్య నగర్, సాయి నగర్ కాలనీలోని ఇళ్లు వర్షం నీటితో జలదిగ్భంధమయ్యాయి. ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అధికారులు దీనిపై స్పందించాలని కోరుతున్నారు.