గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

అన్నమయ్య: కురబలకోట మండలం అంగళ్లు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు సోమవారం ఎస్ఐ దిలీప్ కుమార్ తెలిపారు. చతీస్‌ఘడ్‌కు చెందిన రామ్ సింగ్ కోమటి అంగళ్లు సమీపంలోని ఆర్చి వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. వ్యక్తి మృతిచెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.