సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు స్టే
సినిమా టికెట్ ధరల పెంపుపై TG హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. టికెట్ రేట్లు పెంచాలంటే సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం GO జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంలో పిటిషన్ వేసింది. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే విధించింది. టికెట్ ధరల పెంపుపై ఎప్పుడూ అనుసరిస్తున్న విధానాన్నేపాటించాలని తెలిపింది.