చోరీకి గురైన వాహనం దగ్ధం
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధి రైతు బజార్ కాలనీ సమీపంలో ఇటీవల చోరీకి గురైన ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని దుండగులు దగ్ధం చేశారు. మహేష్ అనే వ్యక్తి తన ఇంటి ముందు ద్విచక్ర వాహనం పార్క్ చేయగా గుర్తుతెలియని దుండగులు రెండు రోజుల క్రితం చోరీ చేశారు. శనివారం స్థానిక డబుల్ బెడ్ రూమ్ కాలనీ వద్ద వాహనాన్ని దగ్ధం చేసినట్టు గుర్తించారు.