జనవాసాల మధ్య చెత్త, వ్యర్థాలు

కృష్ణా: ఇబ్రహీంపట్నం మండలంలోని ఫెర్రిలో జనవాసాల మధ్య ఉన్న కాలిస్థలంలో చెత్త, వ్యర్థాలు ఉండటంతో డంపింగ్ యార్డును తలపిస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఒక్కోసారి దుర్గంధం వెదజల్లుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఇక్కడ మురుగుడు ఉండడంతో దోమలు బెడద అధికంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, తగు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.