చర్చలతో ప్రారంభమైన కొనుగోళ్లు
NLG: మిర్యాలగూడలో నిలిచిపోయిన ధాన్యం కొనుగోళ్లు అధికారుల జోక్యంతో మళ్ళీ ప్రారంభమయ్యాయి. గత రాత్రి రైతులు, మిల్లర్ల మధ్య జరిగిన వాగ్వాదంతో కొనుగోళ్లు ఆగిపోగా, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, డీఎస్పీ రాజశేఖర్ రాజు మిల్లర్లతో అత్యవసర చర్చలు జరిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతులకు అందాలని ఎమ్మెల్యే ఆదేశించారు.