ఎమ్మెల్యే మేడిపల్లి హౌస్ అరెస్ట్

ఎమ్మెల్యే మేడిపల్లి హౌస్ అరెస్ట్

KNR: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యాన్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ అక్రమ కేసులు పెట్టిందంటూ టీపీసీసీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు. గేట్ దూకి బయటకు వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.