చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
KMM: ఎర్రుపాలెం మండల పరిధిలోని పెగళ్లపాడు కట్టలేరులో పడి వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పెగళ్ళపాడు గ్రామానికి చెందిన సగ్గుర్తి వెంకటరత్నం(57) శనివారం సాయంత్రం కట్టలేరు నదిలో చేపలు వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. కుమారుడు ప్రవీణ్ ఫిర్యాదుతో ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.