VIDEO: 'బాధిత రైతులకు త్వరలోనే నష్టపరిహారం ఇప్పిస్తా'

SRD: మనూరు మండలంలో నేషనల్ హైవే కోసం భూములు ఇచ్చిన బాధిత రైతులకు త్వరలోనే పరిహారం ఇప్పిస్తానని జహీరాబాద్ MP సురేష్ శెట్కార్ తెలిపారు. సోమవారం రాత్రి మినిస్టర్ క్వార్టర్‌లో యువ కాంగ్రెస్ నాయకుడు మహిపాల్ రెడ్డి MP ని కలిసి విషయాన్ని ప్రస్తావించి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాధిత రైతులతో మాట్లాడించారు. త్వరలోనే MP ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.