VIDEO: జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

VIDEO: జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

తూ.గో జిల్లాలో సోమవారం అకస్మాత్తుగా వాతావరణం మారింది. గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తీవ్రమైన ఈదురు గాలులతో వరుణుడు బీభత్సం సృష్టించాడు. దీంతో వేసవి ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఊరట లభించింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.