'మారి 2' కాంబో రిపీట్ కానుందా..?

'మారి 2' కాంబో రిపీట్ కానుందా..?

సాయిపల్లవి, హీరో ధనుష్‌తో కలిసి మరోసారి నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆమెకు హిట్ ఇచ్చిన 'అమరన్' దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ మూవీ స్క్రిప్ట్‌కు సాయిపల్లవి ఇప్పటికే ఓకే చెప్పినట్లు టాక్ నడుస్తోంది. ఈ ప్రాజెక్టుపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.