VIDEO: వేగంగా కైదమ్మకుంట చెరువు పనులు
RR: హఫీజ్ పేట పరిధి కైదమ్మకుంట చెరువు గతంలో గుర్రపుడెక్కతో నిండి, మురుగు నీటితో కలుషితంగా మారిందని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం చెరువు పునరుద్ధరణ అద్భుతంగా జరుగుతోంది. సుందరీకరణ పనులు మొత్తం పూర్తిచేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా ఐదవ ప్రాజెక్ట్ కింద ఈ చెరువు అభివృద్ధి జరుగుతుందని అధికారులు తెలిపారు.