VIDEO: 'కార్మికులకు న్యాయం చేయాలి'
AKP: మాకవరపాలెం మండలం పయనీర్ ప్రైవేట్ లిమిటెడ్ (అన్రాక్) కంపెనీ కార్మికులకు న్యాయం చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం వారు మాట్లాడుతూ.. కంపెనీలో కార్మికులకు కనీస వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంవత్సరాల తరబడి పనిచేస్తున్న పర్మినెంట్ చేయడం లేదన్నారు. ఎనిమిది గంటలకు మించి పని చేసిన ప్రతీ కార్మికుడికి వేతనం ఇవ్వడం లేదన్నారు.