DRDO.. కీలక ప్రయోగం విజయవంతం

DRDO.. కీలక ప్రయోగం విజయవంతం

భారతీయ రక్షణ రంగంలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO) కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాల నుంచి పైలట్ సురక్షితంగా బయటపడే టెక్నాలజీని DRDO రూపొందించింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రయోగాన్ని DRDO ప్రయోగించగా.. పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.