VIDEO: రామరాజ్యం సురక్షితం: MLA పాయల్
ADB: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత దేశం రామరాజ్యంలా సురక్షితంగా, శాంతియుతంగా ముందుకు కొనసాగుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని రవీంద్ర నగర్, శాంతినగర్ కాలనీల్లో నిర్వహించిన రామ నవమి వేడుకల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలకు MLA పాయల్ శంకర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.