రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభం..!

రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభం..!

ASR: రాజవొమ్మంగి మండలం జడ్డంగి వాల్మీకి నగర్ శివారులో సిమెంట్ రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది. వీధి లైట్లు లేకపోవడంతో రాత్రి వేళ వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాల వారు స్తంభాన్ని ఢీకొట్టే ప్రమాదముంది. అధికారులు వెంటనే స్పందించి స్తంభాన్ని మార్చి, లైట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.