MLC పదవికి CM నీతీశ్ కుమార్ రాజీనామా
బిహార్ CM నీతీశ్ కుమార్ తన MLC సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన ఇటీవలే రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఉంటే, ఎన్నికైన 14 రోజులలోపు ఏదో ఒక పదవికి రాజీనామా చేయాలి. ఆ గడువు నేటితో ముగుస్తుండటంతో MLC పదవిని వదులుకున్నారు. త్వరలోనే CM పదవికి కూడా రాజీనామా చేయనున్నారు. దీంతో తదుపరి CM ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది.