మార్చి 14న జాతీయ లోక్ అదాలత్
NDL: మార్చి 14న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని నందికొట్కూరు జూనియర్ సివిల్ జడ్జి వీ. దివ్య పిలుపునిచ్చారు. గురువారం కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజీ అయ్యే సివిల్, క్రిమినల్ తగాదాలలో ఇరుపక్షాలతో మాట్లాడి రాజీ అయ్యే విధంగా కక్షిదారులకు అవగాహన కల్పించాలన్నారు.