VIDEO: 'వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'
KMM: సింగరేణి మండలం ఉసిరికాయలపల్లిలో మొంథా తుఫాన్ వల్ల గాలివానకు దెబ్బతిన్న వరి పంటలను గురువారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ పరిశీలించారు. తుపాను కారణంగా మండలంలో మిర్చి, వరి, పత్తి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు రాలేదన్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలన్నారు.