కొత్తూరు అండర్ పాస్ వద్ద నిలిచిన నీరు

రంగారెడ్డి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి షాద్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తూరు అండర్ పాస్ వద్ద వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్పందించిన పోలీసులు నీటిని తొలగించేందుకు శ్రమిస్తున్నారు. వాహనదారులు సహకరించాలని కోరారు.